Draksharama (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని ప్రసిద్ధ శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఏవీ దుర్గ భవాని ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం, పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం అందజేశారు. ఈ పర్యటనలో రామచంద్రపురం తనిఖీదారు ఆర్. బాలాజీ రాంప్రసాద్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం దర్శన, పూజా కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి.

