ePaper
Friday, October 23, 2026
ePaper
Homeరాజకీయంసుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం....అభివృద్ధికి కొత్త బాటలు....అజయ్ కుమార్...

సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం….అభివృద్ధికి కొత్త బాటలు….అజయ్ కుమార్…

📰 Generate e-Paper Clip

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK):

నాలుగో వార్డులో టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి వేగుళ్ల అజయ్‌కుమార్ ప్రచారం….

కూటమి ప్రభుత్వం సుపరిపాలన దిశగా ముందుకు సాగుతూ అభివృద్ధికి కొత్త బాటలు వేస్తుంది అని మండపేట మున్సిపల్ కూటమి టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి వేగుళ్ల అజయ్‌కుమార్ పేర్కొన్నారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగో వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి చుండ్రు అగస్తరాజుతో కలిసి ఆయన వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపిస్తామని, విజయం తథ్యమని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా అజయ్‌బాబు మాట్లాడుతూ మండపేట పట్టణ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పటికే పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధికి విశేష కృషి జరిగిందని, శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు కొత్త రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతామని తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అనంతరం పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.మండపేట అభివృద్ధిలో తన తాత దివంగత సర్దార్ వేగుళ్ల వీర్రాజు, పెదనాన్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుల కృషి అడుగడుగునా కనిపిస్తుందన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో మండపేటను రాష్ట్రంలోనే నంబర్‌వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో వారు ప్రత్యేక ముద్ర వేశారని కొనియాడారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ మండపేటను మరింత అభివృద్ధి పథంలో నడిపించడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు.రానున్న ఎన్నికల్లో తనతో పాటు నాలుగో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చుండ్రు అగస్తరాజును సైతం సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో టిడిపి సీనియస్ నాయకులు మాజీ కౌన్సిలర్ చుండ్రు రాంబాబు, అమలాపురం పార్లమెంట్ టీడీపీ వాణిజ్య విభాగ అధ్యక్షులుఉంగరాల రాంబాబు, నల్ల అబ్బు, చెకూరి పాపారావు, కేశవరపు శ్రీను, నూని శరణ్, భార్గవ్, టిడిపి టౌన్ అధ్యక్షులు మచ్చా నాగు,పర్వతిన భానుప్రకాష్‌తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img