ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeఎడిటోరియల్ద్రాక్షారామం – యానం రహదారిపై ఘోర ప్రమాదం: బోల్తా పడిన లారీ!

ద్రాక్షారామం – యానం రహదారిపై ఘోర ప్రమాదం: బోల్తా పడిన లారీ!

📰 Generate e-Paper Clip

వేగయమ్మపేట :విశ్వం వాయిస్ న్యూస్

ద్రాక్షారామం నుంచి వేగయ్యమ్మపేట మీదుగా యానం వెళ్తున్న లారీ గురువారం తెల్లవారుజామున తీవ్ర ప్రమాదానికి గురై బోల్తా పడింది. డ్రైవర్ కునుకుపాటు పడటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. వేగయ్యమ్మపేట సమీపంలోకి రాగానే లారీ ఒక్కసారిగా అదుపు తప్పడంతో, ప్రమాదాన్ని ముందే గ్రహించిన డ్రైవర్ వెంటనే చాకచక్యంగా కేబిన్ నుంచి కిందకు దూకేశాడు. మరుక్షణంలోనే లారీ రోడ్డు పక్కన బోల్తా పడింది.

డ్రైవర్ ముందుగానే కిందకు దూకేయడంతో ఆయనకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజాము వేళ కావడంతో రహదారిపై ఇతర వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ఘోర ప్రమాదం తప్పినట్లయింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img