ePaper
Saturday, September 5, 2026
ePaper
Homeతూర్పుగోదావరిచెట్ల కొమ్మల తొలగింపు.. విద్యుత్ సరఫరా నిలిపివేత

చెట్ల కొమ్మల తొలగింపు.. విద్యుత్ సరఫరా నిలిపివేత

📰 Generate e-Paper Clip

రాయవరం, East Godavari (VISWAM VOICE DESK):

పసలపూడి, ఎర్రమట్టిపురం గ్రామాల వినియోగదారులకు విజ్ఞప్తి

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:

 

రాయవరం మండలంలోని పసలపూడి సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనులు చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. పసలపూడి సబ్‌స్టేషన్ నుంచి వచ్చే పసలపూడి హెచ్‌క్యూ ఫీడర్ లైన్‌పై చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా పసలపూడి, ఎర్రమట్టిపురం గ్రామాల్లో గృహ అవసరాలకు సంబంధించిన విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. సంబంధిత గ్రామాల విద్యుత్ వినియోగదారులు ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించడంతో పాటు ప్రమాదాలను నివారించేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వినియోగదారులు అసౌకర్యాన్ని అర్థం చేసుకుని విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె.పి.బి. నటరాజన్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img