Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఫోటోగ్రాఫర్లు సాంకేతిక విద్య అలవర్చుకోవాలి రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, కోరుకొండ మండలం:

ఫోటోగ్రాఫర్లు సాంకేతిక విద్య అలవర్చుకోవాలి.

– రాష్ట్ర హోంశాఖమాత్యులు తానేటి.

కోరుకొండ విశ్వం వాయిస్ న్యూస్: నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో ప్రతి ఫోటోగ్రాఫర్ అధునాతిన సాంకేతిక విద్యను అలవర్చుకోవాలని రాష్ట్ర హోంశాఖమాత్యులు తానేటి వనిత అన్నారు. శుక్రవారం మండలంలోని ఎస్వీపీసీ కన్వర్షన్ హాల్లో ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో గ్రాఫర్ జిల్లా అధ్యక్షులు కొని శ్రీను, రాష్ట్ర అధ్యక్షులు పోసిన వీరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఫోటో ఎక్స్పోకు తానేటి వనిత ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె ఫోటోగ్రఫీ పితామహుడు డాగురె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వివిధ ఫోటోగ్రఫీ స్టాల్స్ ను తిలకించి, అధునాతన ఫోటో కెమెరాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తానేటి మాట్లాడుతూ గత స్మృతులకు రూపకర్తలుగా ఫోటోగ్రాఫర్లు నిలుస్తారని, పది పదలకు ఒక ఫోటో బాసటగా నిలుస్తుందన్నారు. ఫోటోగ్రాఫర్లు అధునాతన సాంకేతిక విద్య నందిపుచ్చుకొని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. కమిటీ ఆధ్వర్యంలో తానేటి వనితకు పూల మాలవేసి, మెమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు. జాయింట్ కలెక్టర్ ఎన్ భరత్ తేజ, రుడ చైర్మన్ మేడపాటి షర్మిల రెడ్డి, డాక్టర్ గన్ని భాస్కరరావు లను కమిటీ ఘనంగా సత్కరించింది. అనంతరం ఫ్యాషన్ షో తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు బాబి, రాష్ట్ర నాయకులు హరి, రాజేంద్ర బాబు, జిల్లా నాయకులు ఏ ఫణి కుమార్, కేత శ్రీనివాస్, లాజర్, రావు అండ్ రావు, సిరి శ్రీను, ప్రభాకర్, వివిధ జిల్లాల ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement