Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అయోధ్యలో రామ ప్రాణ ప్రతిష్ట రామచంద్రపురం అంతా రామ మయం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

షాపుకి జై శ్రీరామ్ జెండాలు కట్టిన సెల్ ఫోను వర్తక సంఘం రామచంద్రపురం పట్టణం స్థానిక రాజగోపాల్ సెంటర్ నందు ది రామచంద్ర పురం మొబైల్ షాప్ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ తరపున ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రతి కుటుంబం పైనా ఉండాలని సంకల్పించి ఆదివారం ప్రతి షాపుకు జై శ్రీరామ్ జెండా కట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు కంచుమర్తి బాబురావు,అధ్యక్షులు గంగరాజు వెంకటేశ్వరరావు , ఉపాధ్యక్షులు భార్గవరెడ్డి, కార్యదర్శి రాజా, కోశాధికారి నాగేశ్వరరావు, ఎస్విఆర్ రెడ్డి,రాంబాబు,సురేష్,మేడిశెట్టి శ్రీ మసేన్,పడాల సూరిబాబు,రమేష్ ఇంకా ఇతర సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హాసన్ బాధ గ్రామంలో శివాలయం వద్ద వేంచేసి యున్న శ్రీ సీతా రామాలయం వద్ద ఈరోజు భక్తుల సమూహంగా రాములవారి ఉత్సవమూర్తులను భజన బృందంతో పల్లకిలో ఊరేగింపుగా గ్రామ ప్రదక్షణ చేసి అనంతరం శ్రీసీతా రాములవారికి ఉండి వీరభద్రశర్మ బ్రహ్మత్వంలో కాల్డారి బ్రహ్మాజీ జయలక్ష్మి దంపతులు యజమానులుగా పూజా కార్యక్రమాలు నిర్వర్తించి భక్తులు తెచ్చిన ప్రసాదాలు నివేదన చేసి భక్తులందరూ సామూహికంగా రామనామ సంకీర్తన చేసారు.అనంతరం శ్రీ భీమేశ్వర భజన బృందం హసన్ బాద వారిచే భజన కార్యక్రమం జరిగింది.భక్తుల సహాకారంతో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు.సాయంత్రం గ్రామ భక్తులు రామాలయంలో దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు,జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గ్రామ పెద్దలు చింతపల్లి వీరభద్రరావు,ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చోడిశెట్టి బద్రరావు,బొల్లం సత్తిరాజు,కాకిలేటి రాంబాబు,పచ్చిపాల రామూర్తి,యేరుబండి చిన సత్యనారాయణ,గొల్లపల్లి సుబ్బారాయుడు బ్రదర్స్, గ్రామ ప్రజలు,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.హాసన్ బాధ గ్రామంలో శివాలయం వద్ద వేంచేసి యున్న శ్రీ సీతా రామాలయం వద్ద ఈరోజు భక్తుల సమూహంగా రాములవారి ఉత్సవమూర్తులను భజన బృందంతో పల్లకిలో ఊరేగింపుగా గ్రామ ప్రదక్షణ చేసి అనంతరం శ్రీసీతా రాములవారికి ఉండి వీరభద్రశర్మ బ్రహ్మత్వంలో కాల్డారి బ్రహ్మాజీ జయలక్ష్మి దంపతులు యజమానులుగా పూజా కార్యక్రమాలు నిర్వర్తించి భక్తులు తెచ్చిన ప్రసాదాలు నివేదన చేసి భక్తులందరూ సామూహికంగా రామనామ సంకీర్తన చేసారు.అనంతరం శ్రీ భీమేశ్వర భజన బృందం హసన్ బాద వారిచే భజన కార్యక్రమం జరిగింది.భక్తుల సహాకారంతో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు.సాయంత్రం గ్రామ భక్తులు రామాలయంలో దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు,జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గ్రామ పెద్దలు చింతపల్లి వీరభద్రరావు,ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చోడిశెట్టి బద్రరావు,బొల్లం సత్తిరాజు,కాకిలేటి రాంబాబు,పచ్చిపాల రామూర్తి,యేరుబండి చిన సత్యనారాయణ,గొల్లపల్లి సుబ్బారాయుడు బ్రదర్స్, గ్రామ ప్రజలు,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శీల గ్రామం రామ భక్తులు అన్నదాన కార్యక్రమం శీల గ్రామంలో మెయిన్ రామాలయం వద్ద ఈరోజు మధ్యాహ్నం 11.గంటల నుండి

భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం 2:30 గంటల వరకు జరిగింది

ఈ అన్నదాన కార్యక్రమం వేలాదిమంది భక్తులు వచ్చి రాముల వారి అన్నదాన ప్రసాదని స్వీకరించడం జరిగింది.

 

వైభవంగా లయిన్ జి.వి.రావు ఆధ్వర్యంలో శ్రీరామ సంకీర్తన ర్యాలీ

అయోధ్యపురిలో బాలరాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం సందర్బంగా దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటిన నేపథ్యంలో

సోమవారం మోడరన్ విద్యాసంస్థల అధినేత లయిన్ జి.వి.రావు నేతృత్వంలో మోడరన్ జి.ఆర్.సి.జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సి.హెచ్.రాజేష్ పర్యవేక్షణలో మోడరన్ జూనియర్ కాలేజి స్టాఫ్,విద్యార్థులు ఆధ్యాత్మిక వాతావరణంలో జై శ్రీరామ్ అని ముక్తకంఠంతో నినాదిస్తూ,శ్రీరాముని దివ్య మంగళ రూపాన్ని పల్లకిలో ఊరేగిస్తూ రామచంద్రపురం ప్రధాన రహదారులలో శ్రీరామ సంకీర్తన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా మోడరన్ అధినేత లయిన్ జి.వి.రావు మాట్లాడుతూ శ్రీరాముడు మానవ రూపంలో జన్మించిన దేవుడని ప్రణమిల్లుతూ,మన భారతదేశం సనాతనమైనది, సదా నూతనమైనదని, దేశమంతా రామమయంగా మారి పండుగ వాతావరణం నెలకొన్న ఈ శుభ సందర్భంలో భారతీయ చరిత్ర,సంస్కృతి సంప్రదాయాలు విద్యార్థులు తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.అనంతరం ఇంటర్మీడియట్ ప్రిన్సిపాల్ సి.హెచ్.రాజేష్ మాట్లాడుతూ హక్కుల కంటే భాద్యత గొప్పదని చాటి చెప్పేది రామతత్త్వం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్

పి.ఎస్.ప్రకాష్,అకడమిక్ అడ్వైజర్ సి.హెచ్.శ్రీనివాస్,మోడరన్ జూనియర్ కాలేజీ స్టాఫ్,విద్యార్ధులతో పాటు స్థానికులు కూడా అధికసంఖ్యలో పాల్గొన్నారు మరియు శోభా యాత్రలో పాల్గొన్నా జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ టౌన్ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ టౌన్ యూత్ ప్రెసిడెంట్ మట్ట దుర్గారావు నియోజకవర్గ ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement