ePaper
Sunday, October 25, 2026
ePaper
Homeరాజకీయంప్రజల ఆకాంక్షలే ప్రాధాన్యంగా కూటమి పాలన.....ఇంటింటా ఎన్నికల ప్రచారంలో జనసేన అభ్యర్థి పొలమూరి విజయ్ ....

ప్రజల ఆకాంక్షలే ప్రాధాన్యంగా కూటమి పాలన…..ఇంటింటా ఎన్నికల ప్రచారంలో జనసేన అభ్యర్థి పొలమూరి విజయ్ ….

📰 Generate e-Paper Clip

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK):

మండపేట పురపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో 33వ వార్డులో కూటమి బలపరిచిన జనసేన కౌన్సిలర్ అభ్యర్థి పొలమూరి విజయ దుర్గాప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. శుక్రవారం వార్డులో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా తనను గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీనగర్, పార్థసారథి నగర్ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చొరవతో రామచంద్రుడు కాలువ గట్టు నుంచి బైపాస్ రోడ్డు పెట్రోల్ బంకు వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారని వివరించారు. స్థానిక ప్రజల చిరకాల కోరిక మేరకు ఈ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజల రాకపోకలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ–జనసేన కూటమి ప్రభుత్వం చిరునామాగా నిలుస్తోందన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జన సేన ఇన్ ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ ల సహకారంతో 33వ వార్డును అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి పాటుపడతానని తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో 33వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి ఎండీ కరీం, మాజీ కౌన్సిలర్లు బెల్లపుకొండ దొరబాబు, లంకలపల్లి రాంబాబు, రాంబిల్లి పాపారావు, సురాల కుమారి, తీగిరెడ్డి ప్రశాంత్ కుమార్, మొండి కల్పన, ఎండీ అహ్మద్, పైడివాడ కరుణకుమార్, ధర్మతేజ, వెలిశెట్టి ఏసు, వెలిశెట్టి సురేష్, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img