ePaper
Saturday, October 24, 2026
ePaper
Homeరాజకీయంమీ ఇంటి బిడ్డగా... మీలో ఒకరిగా... మీకు సేవ చేయడమే నా సంకల్పం... వైసీపీ చైర్మన్...

మీ ఇంటి బిడ్డగా… మీలో ఒకరిగా… మీకు సేవ చేయడమే నా సంకల్పం… వైసీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రాము…

📰 Generate e-Paper Clip

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK):

మీ ఇంటి బిడ్డగా , మీలో ఒకడిగా ఉంటూ కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తానని, పట్టణ ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రాము అన్నారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ఓసీ జనరల్ స్థానం అయినప్పటికీ అట్టడుగు వర్గానికి చెందిన తనను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చైర్మన్ అభ్యర్థిగా బలపరిచారని తెలిపారు. ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తారనే నమ్మకం ఉందన్నారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 8వ వార్డులో వైసీపీ అభ్యర్థి కొడమంచిలి వేణుతో కలిసి డాక్టర్ రాము పర్యటించారు. తొలుత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ మద్దతు కోరారు.ఈ సందర్భంగా డాక్టర్ రాము మాట్లాడుతూ మీలో ఒకడినై ఉంటా మీ ఇంటి బిడ్డగా నిలుస్తా నన్ను గెలిపిస్తే మీ ఇంటి బిడ్డను ఆశీర్వదించినట్లే. మీ కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ పట్టణ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తా అని భరోసా ఇచ్చారు. ఎముకల వైద్యుడిగా ప్రజలకు సేవలందిస్తున్న తనకు మరింత విస్తృతంగా సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.తనతోపాటు పట్టణంలోని 36 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి ఘన విజయాన్ని అందించాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, సూరంపూడి సత్యప్రసాద్, మడికి ఆనందరావు, కొడమంచిలి భాస్కరరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img