ePaper
Friday, October 23, 2026
ePaper
Homeరాజకీయంమండపేటలో వైఎస్సార్‌సీపీ జోరు....

మండపేటలో వైఎస్సార్‌సీపీ జోరు….

📰 Generate e-Paper Clip

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK):

33, 34 వార్డుల్లో గడపగడపకు డాక్టర్ రాము ప్రచారం….

మండపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రాము పట్టణంలోని 33, 34 వార్డుల్లో గడపగడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైయస్సార్ పార్టీ బలపరిచిన వార్డు అభ్యర్థులను, చైర్మన్ అభ్యర్థిగా తనను ఆదరించి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై డాక్టర్ రాము ప్రశ్నలు లేవనెత్తారు. మహిళలకు ప్రతి నెలా ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన హామీ ఎక్కడ అమలవుతోందని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు అమలు చేశారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాల కొనసాగింపుపై ప్రజలు ప్రశ్నించాలని ఆయన పేర్కొన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే పాలనపై ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.అనంతరం 33, 34 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులు షేక్ గౌస్ మొహిద్దిన్, చెల్లూరి సూర్య కళను,చైర్మన్ అభ్యర్థిగా తనకు మద్దతు తెలిపి గెలిపించాలని డాక్టర్ రాము విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img