ePaper
Sunday, October 25, 2026
ePaper
Homeరాజకీయంమండపేట అభివృద్ధే లక్ష్యంగా వేగుళ్ల అజయ్ కుమార్ ముందడుగు....

మండపేట అభివృద్ధే లక్ష్యంగా వేగుళ్ల అజయ్ కుమార్ ముందడుగు….

📰 Generate e-Paper Clip

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK):

33వ వార్డు కూటమి అభ్యర్థి విజయ్‌కు మద్దతుగా అజయ్ బాబు ప్రచారం….

మండపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మండపేట పట్టణంలోని 33వ వార్డులో కూటమి చైర్మన్ అభ్యర్థి వేగుళ్ల అజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 33వ వార్డు కూటమి అభ్యర్థి పొలామూరి విజయ్‌ ను గ్లాస్ గుర్తుకు, చైర్మన్ అభ్యర్థిగా తనకు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు.వార్డులో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ తన దృష్టిలో ఉన్నాయని ఆ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అజయ్ బాబు తెలిపారు. 33 వ వార్డు మైనార్టీలు అధికంగా ఉండే వార్డు కావడంతో వారి వద్దకు వెళ్లి మైనార్టీల అభ్యున్నతికీ తెలుగుదేశం ప్రభుత్వం నిరంతరం పాటుపడిందని, వారికి వివరిస్తూ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరారు. విజయ్ గెలుపు కోసం తామంతా కృషి చేస్తామని స్థానికులు హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి ఎండీ కరీం, మాజీ కౌన్సిలర్లు లంకలపల్లి రాంబాబు, బెల్లపుకొండ దొరబాబు, సురాల కుమారి, ఎండీ గయాసుద్దీన్, షేక్ కరీమ్,దేవరపల్లి వేణు, చుక్కల ఈశ్వరరావు, దొడ్డ గంగరాజు, పల్లా గంగరాజు, మొండి కల్పన, భవిరిశెట్టి మోహిని తదితరులతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img