ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeఎడిటోరియల్కువైట్‌లో తెలుగు కార్మికుల సమస్యలపై ఇండియన్ ఎంబసీకి జై భీమ్ యూత్ వినతి పత్రం

కువైట్‌లో తెలుగు కార్మికుల సమస్యలపై ఇండియన్ ఎంబసీకి జై భీమ్ యూత్ వినతి పత్రం

📰 Generate e-Paper Clip

కువైట్‌లో నివసిస్తున్న తెలుగు కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు జై భీమ్ యూత్ సభ్యులు ముందడుగు వేశారు. బుధవారం కువైట్‌లోని ఇండియన్ ఎంబసీని సందర్శించిన జై భీమ్ యూత్ బృందం, అక్కడి అధికారులను కలిసి ప్రత్యేకంగా వినతి పత్రం సమర్పించారు. విదేశాల్లో పనిచేస్తున్న తెలుగు వారు ఎదుర్కొంటున్న ఉద్యోగ, వేతన సమస్యలతో పాటు యజమానుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.ఈ వినతిపై ఇండియన్ ఎంబసీ అధికారులు సానుకూలంగా స్పందించారు. కువైట్‌లో ఉన్న భారతీయులు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొన్నా ఎంబసీ కార్యాలయానికి సమాచారం అందించవచ్చని, పరిశీలించి తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విదేశాల్లో కుటుంబాలకు దూరంగా ఉంటూ కష్టపడి పనిచేస్తున్న తెలుగు కార్మికుల సంక్షేమం కోసం ముందుకు రావడం అభినందనీయమని పలువురు జై భీమ్ యూత్ కృషిని ప్రశంసించారు.ఈ సందర్భంగా జై భీమ్ యూత్ ప్రతినిధులు మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్న తెలుగు వారి కష్టాలను తమ సొంత సమస్యలుగా భావించి పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తామని తెలిపారు. బాధితుల హక్కులు, సంక్షేమం కోసం తమ వంతు మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ కువైట్ గ్రూప్ ప్రతినిధులు బాషా, అజయ్, రాజు, నాని, మనీ, వినోద్, సత్తిబాబు, శ్రీను, సాగర్, దివాకర్, సురేష్, చందాపర్ చిన్నోడు, గణేష్, జక్కల సురేష్ కుమార్, ఇతర తెలుగు సభ్యులు పాల్గొన్నారు. తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన జై భీమ్ యూత్ బృందాన్ని పలువురు కొనియాడారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img