వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్*
రామచంద్రపురం: విశ్వం వాయిస్ న్యూస్
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం పట్టణంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను కూటమి పార్టీ నాయకులతో కలిసి సందర్శించి, శ్రీ విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాధుని ఆశీస్సులతో రాష్ట్రంలో సుఖశాంతులు, సమృద్ధి నెలకొనాలని ప్రార్థించారు.అంతకుముందు మంత్రి సుభాష్ తన స్వగృహంలో, మంత్రి తండ్రి, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని గణనాధుని వేడుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ నవ్య ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేవుని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న కూటమి ప్రభుత్వం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అలాగే కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై వినాయకుడు తన కరుణాకటాక్షాలు ప్రసరించి, అందరినీ చల్లగా దీవించాలని ప్రార్థించినట్లు మంత్రి సుభాష్ పేర్కొన్నారు.

