ఉదయపు నడక ఆరోగ్యానికి వరం లాంటిదని, ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం అరగంట పాటు నడవడం అలవాటు చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని వాకర్స్ క్లబ్ జిల్లా గవర్నర్ తోలేటి సూర్యనారాయణ అన్నారు. ఆదివారం ద్రాక్షారామ మార్కెట్ యార్డులో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ద్రాక్షారామ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయపు నడకలో పాల్గొనే వారి ఆరోగ్య పరిరక్షణకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారానికి ఒకసారి అమృతహారం అందించడం, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం, సభ్యులకు హెల్త్ స్కీములపై అవగాహన కల్పించడం వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. క్లబ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రామంలో పలు మంచి కార్యక్రమాలు చేపడుతున్న మంచెం ఆంజనేయమూర్తి, షెట్ దినేష్ దంపతులను క్లబ్ తరఫున ఘనంగా సన్మానించారు. అనంతరం సభ్యులు కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిష్వంత్రాయ్, ఎంపీపీ మడకా రాంబాబు, వైస్ ఎంపీపీ కొండేటి జానకిరామయ్య, క్యాబినెట్ సెక్రటరీ ఎం. మల్లేశ్వరరావు, డిప్యూటీ గవర్నర్ తిలక్ బాబు, నక్కా భీమశంకరం, అనిశెట్టి అప్పారావు, ములకల రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిరోజూ అరగంట నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు: వాకర్స్ క్లబ్ జిల్లా గవర్నర్ తోలేటి సూర్యనారాయణ
RELATED ARTICLES

