ePaper
Saturday, November 21, 2026
ePaper
Homeఎడిటోరియల్రామచంద్రపురం మండలంలో పంచాయతీ ఎన్నికల సందడి.. మూడో రోజు భారీగా నామినేషన్లు

రామచంద్రపురం మండలంలో పంచాయతీ ఎన్నికల సందడి.. మూడో రోజు భారీగా నామినేషన్లు

📰 Generate e-Paper Clip

సర్పంచ్ స్థానాలకు 92, వార్డు సభ్యుల స్థానాలకు 383 నామినేషన్లు దాఖలు

గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు–2026 నేపథ్యంలో రామచంద్రపురం మండలంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా శుక్రవారం మూడో రోజు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.మండలంలోని సర్పంచ్ స్థానాలకు మూడో రోజు 92 నామినేషన్లు అందగా, మొదటి రోజు 15, రెండో రోజు 65 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మూడు రోజుల వ్యవధిలో సర్పంచ్ స్థానాలకు మొత్తం 172 నామినేషన్లు నమోదయ్యాయి.అదేవిధంగా వార్డు సభ్యుల స్థానాలకు మూడో రోజు 383 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు 28, రెండో రోజు 222 నామినేషన్లు అందాయి. తాజా నామినేషన్లతో కలిపి ఇప్పటివరకు వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 633 నామినేషన్లు నమోదయ్యాయి.మండలంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి, రామచంద్రపురం నామినేషన్ ప్రక్రియ పరిశీలకురాలు కె. పర్వత జ్యోతి వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img