ByGanesh
Wed 30th Oct 2024 05:37 PM
పుష్ప ద రైజ్ లో అల్లు అర్జున్ ఎర్రచందనం కూలి నుంచి అడవిని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు, ఈ క్రమంలో అతను పెంచుకున్న శత్రుత్వాన్ని చూపించారు దర్శకుడు సుకుమార్, పుష్ప ద రూల్ లీడ్ కోసం భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహద్ ఫాసిల్ కేరెక్టర్ ని యాడ్ చేసిన సుకుమార్ పుష్ప 2 మొత్తం అల్లు అర్జున్ vs ఫహద్ ఫాసిల్ అన్నట్టుగా చూపించబోతున్నారు.
అయితే పుష్ప 2 కి సీక్వెల్ గా పుష్ప 3 ఉంటుంది అనే హింట్ ఎప్పుడో ఇచ్చారు. దాని కోసం సుకుమార్ పెద్ద ప్లానే వేసినట్టుగా తెలుస్తుంది. పుష్ప 1 కన్నా 2 పై చాలా హైప్ పెంచిన సుకుమార్ పుష్ప 3 కి మరింత హైప్ ఉండేలా చూసుకుంటున్నారట. అందులో భాగంగానే పుష్ప 3 కోసం ఓ స్టార్ హీరోను లాక్ చేశారట సుకుమార్.
పుష్ష 2 క్లైమాక్స్ లోనే, పుష్ష 3కి లీడ్ సీన్లు చూపించే ఛాన్స్ ఉండడమే కాదు ఆ సీన్స్ లోనే సుకుమార్ ఆ హీరో ఎవరు అనేది రివీల్ చెయ్యబోతున్నారట, పుష్ప 2 క్లైమాక్స్‌లో ఓ హీరో వాయిస్ వినిపించబోతున్నారట. అసలా హీరో ఎందుకు వస్తాడు అనే విషయంలో సస్పెన్స్ క్రియేట్ చేస్తూ పుష్ప 2 ను ఎండ్ చేస్తూ పుష్ప 3 ని అనౌన్స్ చేస్తారట. సో సుకుమార్ పుష్ప సీరీస్ లో ఇంకెన్ని విచిత్రాలు చూపిస్తారో మరి.
Pushpa is the star hero of Pushpa 3 from Pushpa The Rule:
Pushpa 3 major update shared