ePaper
Friday, August 14, 2026
ePaper
Homeభక్తి - ఆధ్యాత్మికతభక్తిశ్రద్ధలతో శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి

భక్తిశ్రద్ధలతో శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి

📰 Generate e-Paper Clip

సమస్యలు తీర్చాలని మొక్కుతూ కులదేవతకు సారె సమర్పణ

 

రాయవరం గ్రామ ప్రజల మేలుకోరి దేవాంగసంఘం పూజలు

 

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:

 

దేవాంగుల కులదేవత శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి వేడుకలు బుధవారం రాయవరం గ్రామంలోని మఠం వీధిలో ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే ఈ పూజా కార్యక్రమానికి దేవాంగ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించారు. కులదేవత ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుతూ ఈ ఏడాది తొలిసారిగా దేవాంగ కుటుంబాల మహిళలు అమ్మవారికి సారెలు సమర్పించారు. పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, జాకెట్లు, చలివిడి, వడపప్పు, మిఠాయిలను సారె రూపంలో సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామదేవతలు, కులదేవతలకు సారెలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు ఇబ్బందుల నుంచి బయటపడాలని కోరుకుంటున్నట్లు దేవాంగ కుల పెద్దలు తెలిపారు. ఇందులో భాగంగా గత వారం రాయవరం గ్రామదేవత పోలమాంబ అమ్మవారికి, పుంతలో ముసలమ్మ తల్లికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ దేవాంగులు శ్రీ చౌడేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి సమర్పించిన సారె ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని దేవాంగ కుల పెద్దలు, కమిటీ సభ్యులు సమన్వయంతో ఘనంగా నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img