RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ఎన్జీవో గా స్వచ్ఛ ఆంధ్ర -2026 అవార్డు అందుకున్న సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంను రామచంద్రపురం పట్టణ ప్రముఖులు, పలు గ్రామాల నాయకులు, ప్రజలు ఈరోజు ఘనంగా సత్కరించారు. రామచంద్రపురం నియోజవర్గంలోని మంజేరు, శీల, శీలంక, ఒంటితాడి, వెల్ల గ్రామాలకు చెందిన నాయకులు, ప్రజలు వాసంశెట్టి సత్యంను మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా, మంత్రి వాసంశెట్టి సుభాష్ సహకారంతో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఒకపక్క సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా, మరోపక్క మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రభుత్వ పరంగానే కాకుండా, వ్యక్తిగతంగా, సి ఎస్ ఆర్ నిధులు తీసుకువచ్చి నియోజకవర్గానికి చేస్తున్న సేవలు ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరన్నారు. ఈ కార్యక్రమంలో జల్లి సత్యనారాయణ, దడాల నాగార్జున, కాజులూరు మండలం జనసేన యువత అధ్యక్షులు కూనపరెడ్డి శివకృష్ణ, గుండారపు శ్రీనివాస్, ఆకుల నారాయణరావు,కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.
*రామచంద్రపురం పట్టణంలోనూ సంబరాలు
రామచంద్రపురంలోని పట్టణ టిడిపి అధ్యక్షులు ఉండవల్లి శివ, కట్టా నాగేశ్వరరావు, కంచుమర్తి బాబురావు, వాసంశెట్టి బాలా, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఫణి తేజ, చింతాకుల ప్రకాష్, 28వార్డు ప్రెసిడెంట్ చంటి, 25వ వార్డు ప్రెసిడెంట్ అంగర శీను, కవల నానాజీ, గడి జగన్,గడి గోవిందు, బల్ల శివ, కూటమి కార్యకర్తలు అవార్డు గ్రహీతను సత్కరించారు.
కేకు కోసి వాసంశెట్టి సత్యం కు శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో ఫౌండేషన్ ద్వారా మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

