ePaper
Thursday, October 1, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విమాన ప్రయాణ అనుభూతి... హైదరాబాద్‌కు టాలెంట్ స్టూడెంట్స్ పయనం

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విమాన ప్రయాణ అనుభూతి… హైదరాబాద్‌కు టాలెంట్ స్టూడెంట్స్ పయనం

📰 Generate e-Paper Clip

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ప్రతిభగల పది మంది విద్యార్థిని విద్యార్థులను, ఇద్దరు ఉపాధ్యాయులను రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో విమానంలో హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. విద్యార్థులకు క్షేత్రస్థాయి విజ్ఞానాన్ని అందించడం, వారిలో ఉన్నత ఆశయాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా మధురపూడి విమానాశ్రయం వెళ్లే ముందు పాఠశాలలో జరిగిన సమావేశంలో రక్ష ఫౌండేషన్ చైర్మన్ తొగరు మూర్తి మాట్లాడుతూ, విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని మరువకుండా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి, భవిష్యత్తులో తాము చదువుకున్న పాఠశాలకే ముఖ్య అతిథులుగా వెళ్లేలా ప్రయోజకులు కావాలని పిలుపునిచ్చారు. కష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ లేదని స్పష్టం చేశారు.

పిల్లల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న ఈ పర్యటన వివరాలను ఆయన వెల్లడించారు. హైదరాబాద్ చేరుకున్న విద్యార్థులకు గోల్కొండ ఫైవ్ స్టార్ హోటల్‌‌లో వసతి కల్పించామని తెలిపారు. మొదటి రోజు వండర్లా, రామోజీ ఫిల్మ్ సిటీ, సాలార్‌జంగ్ మ్యూజియం సందర్శన ఉంటుందని, రెండవ రోజు నగరంలోని పలు విజ్ఞాన కేంద్రాలను చూపించడంతో పాటు ప్రత్యేక మోటివేషన్ తరగతులు నిర్వహిస్తారని చెప్పారు. మూడు రోజుల ఈ పర్యటన ముగింపులో భాగంగా మూడవ రోజు ఉదయం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో విద్యార్థులను రాజమండ్రికి తీసుకువస్తామని వివరించారు.

రౌండ్ టేబుల్ ఇండియా అధ్యక్షుడు అడ్డూరి గౌతమ్ వర్మ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉన్నత ఆశయాలతో చదివి దేశం గర్వించే స్థాయికి ఎదగాలన్నారు. విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు అవసరమని, ఏ విధమైన మార్గదర్శకత్వం లేదా సహకారం కావాలన్నా అందజేస్తామని భరోసా ఇచ్చారు. తమ పాఠశాల విద్యార్థులను ఈ ప్రత్యేక యాత్రకు ఎంపిక చేసినందుకు రౌండ్ టేబుల్ ఇండియా ప్రతినిధులకు కళాశాల ప్రిన్సిపల్ జవహర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img