పట్టణ సుందరీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకే కూటమి ప్రభుత్వం పెద్దపీట
ప్రజలకు మెరుగైన వసతులే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి వాసంశెట్టి సుభాష్
రామచంద్రపురం పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలో రూ.1.78 కోట్లు వ్యయంతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసి చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ కెవిఆర్ఆర్ రాజు లు శంకుస్థాపనలు చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్లాన్ గ్రాంట్, రుడా (RUDA) నిధులతో ఈ పనులు చేపడుతున్నారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రామచంద్రపురం పట్టణాన్ని మరింత సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య సదుపాయాలు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.గతంలో నిర్లక్ష్యానికి గురైన అనేక ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.*వార్డు వారీగా చేపట్టనున్న అభివృద్ధి పనులు*20వ వార్డు – రూ.39.46 లక్షలుకమ్మవారి సావరం నారాయణ కళాశాల నుండి వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు ఆర్‌సీసీ డ్రెయిన్ నిర్మాణం.వెంకటేశ్వరస్వామి ఆలయం నుండి నెక్కంటి వీర వెంకట సత్యనారాయణమూర్తి నివాసం వరకు ఆర్‌సీసీ డ్రెయిన్ నిర్మాణం.21వ వార్డు – రూ.44.93 లక్షలునెక్కంటి వీర వెంకట సత్యనారాయణమూర్తి ఇంటి నుండి ముచ్చిమిల్లి రోడ్డు వరకు ఆర్‌సీసీ డ్రెయిన్ నిర్మాణం.రత్నంపేటలో ఏపీ గ్రామీణ బ్యాంక్ నుండి బుల్లెట్ నాగేశ్వరరావు వీధి వరకు సీసీ డ్రెయిన్.బుల్లెట్ నాగేశ్వరరావు వీధి నుండి ఫుడ్ హౌస్ వరకు రెండు వైపులా సీసీ డ్రెయిన్ నిర్మాణం.16వ వార్డు -రూ.8.68 లక్షలుఓలేటి శ్రీను నివాసం నుండి చామర్తి వంశీ నివాసం వరకు సీసీ రోడ్డు నిర్మాణం.12వ వార్డు – రూ.4.71 లక్షలుఆఫిషియల్ కాలనీలో డ్రెయిన్ నిర్మాణం.18వ వార్డు – రూ.5.89 లక్షలుగంగుమల్లవారి వీధిలో వినాయక ఆలయం వరకు సీసీ డ్రెయిన్ నిర్మాణం.8వ వార్డు – రూ.9.21 లక్షలుసేనాపతులవారి వీధిలో డ్రెయిన్ మరమ్మతులు, గోడ ఎత్తు పెంపు.వినాయక ఆలయం పరిసర ప్రాంతాల్లో డ్రెయిన్ నిర్మాణం.4వ వార్డు – రూ.9.09 లక్షలు.డి.నెం.14-8-50/9 నుండి మోడరన్ కాలేజీ వరకు సీసీ డ్రెయిన్ నిర్మాణం.2వ వార్డు – రూ.13.76 లక్షలుస్టిల్‌వెల్‌పేటలో చేనేత కార్మిక భవనం మరమ్మతులు.కొత్తూరు రోడ్డులో బాలికల హాస్టల్ వెనుక భాగంలో సీసీ డ్రెయిన్ నిర్మాణం.1వ వార్డు – రూ.31.86 లక్షలుబాలాజీ ఆలయం నుండి ఎస్‌టిపిపి మున్సిపల్ హైస్కూల్ జంక్షన్ సమీపం వరకు ఆర్‌సీసీ డ్రెయిన్ నిర్మాణం పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, రామచంద్రపురం పట్టణంలో ఇప్పటికే కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని, మరిన్ని పనులను దశలవారీగా చేపట్టి ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి ఈ శ్రీకాంత్, ఏఈ సునీల్, పట్టణ టిడిపి అధ్యక్షులు ఉండవెల్లి శివ, గరికపాటి సూర్యనారాయణ, కంచుమర్తి బాబురావు, కట్టా నాగేశ్వరరావు, అక్కల రాగూర్, కడియాల రాఘవన్, సంపత్ సత్యనారాయణమూర్తి, చందాల మల్లిబాబు, చింతాకుల ప్రకాష్, చిక్కాల బాబ్జి, సంధ్యారాణి, దోమ్మలపాటి విజయలక్ష్మి రాజశేఖర్, సవరం సుధీర్, అల్లం శ్రీనివాస్, అంకం శ్రీనివాస్, బల్ల శివ, ఏలూరు ఏసుదాస్, ఆప్కో వెంకట్రావు, గున్నం వినోద్ కుమార్, రిమ్మలపూడి శ్రీనివాస్ చౌదరి, పలివెల జగదీష్, దోమలపాటి లాలి ప్రసాద్, సిరిగినీడి దుర్గాప్రసాద్, పసుపులేటి సత్తిబాబు, బరకాటి రాంబాబు,అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

