ePaper
Sunday, October 25, 2026
ePaper
Homeఎడిటోరియల్విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో కీలక మార్పులు.. ఇక నగదు చెల్లింపులకు స్వస్తి!

విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో కీలక మార్పులు.. ఇక నగదు చెల్లింపులకు స్వస్తి!

📰 Generate e-Paper Clip

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

విద్యుత్ బిల్లుల చెల్లింపుల విషయంలో వినియోగదారులు డిజిటల్ చెల్లింపు విధానాలను వినియోగించుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు. ఇకపై పంచాయతీ కార్యాలయాలు, టెంపుల్స్‌ వద్ద విద్యుత్ బిల్లులను నగదు రూపంలో చెల్లించకుండా, ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, భీమ్ యూపీఐ వంటి యాప్‌ల ద్వారా చెల్లించుకోవాలని తెలిపారు. అదేవిధంగా మీ సేవ కేంద్రాల్లో కూడా విద్యుత్ బిల్లులు చెల్లించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు నగదు చెల్లింపుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా అందుబాటులో ఉన్న డిజిటల్ చెల్లింపు మార్గాలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా ప్రతి నెలా విద్యుత్ బిల్లును గడువు తేదీలోపు క్రమం తప్పకుండా చెల్లించాలని, బిల్లులను పెండింగ్‌లో ఉంచకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. విద్యుత్ బిల్లు చెల్లించే ముందు సరైన కనెక్షన్ నంబర్‌ను పరిశీలించి, చెల్లింపు పూర్తయిన తర్వాత రసీదును భద్రపరచుకోవాలని వినియోగదారులకు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img