ePaper
Wednesday, October 28, 2026
ePaper
Homeరాజకీయం20వ వార్డులో పతివాడ రాణి ఎన్నికల ప్రచారం..

20వ వార్డులో పతివాడ రాణి ఎన్నికల ప్రచారం..

📰 Generate e-Paper Clip

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK):

డాక్టర్ రాము, దాసరి సత్యనారాయణ ల విజయానికి కృషి…

మండపేట పురపాలక ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో 20వ వార్డులో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పతివాడ రాణి విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. చైర్‌పర్సన్ అభ్యర్థి రాము, 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దాసరి సత్యనారాయణలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వార్డులోని ఇళ్లకు వెళ్లి స్థానికులను నేరుగా కలుసుకుంటూ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు వార్డు అభివృద్ధికి కృషి చేసే నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. ఎన్నికల్లో తమ అభ్యర్థులకు ప్రజలు అండగా నిలిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పతివాడ రాణి ప్రచారంతో 20వ వార్డులో ఎన్నికల సందడి నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img