ePaper
Monday, November 23, 2026
ePaper
Homeఎడిటోరియల్వన సమారాధనలు సామాజిక ఐక్యతకు, ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకలు: మంత్రి వాసంశెట్టి సుభాష్

వన సమారాధనలు సామాజిక ఐక్యతకు, ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకలు: మంత్రి వాసంశెట్టి సుభాష్

📰 Generate e-Paper Clip

కార్తీక మాసంలో నిర్వహించే వన సమారాధనలు ప్రకృతితో మమేకం కావడంతో పాటు సామాజిక ఐక్యతను పెంపొందించడానికి, ఆత్మీయ అనుబంధాలను బలోపేతం చేసుకోవడానికి చక్కని వేదికలుగా నిలుస్తాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని నున్న యజ్ఞ గార్డెన్స్‌లో ఆదివారం విజయవాడ శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శెట్టిబలిజ సామాజిక వర్గంలోని వారంతా కుటుంబ సమేతంగా ఒకచోట చేరి పరస్పర పరిచయాలు, స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. సంఘ సభ్యుల మధ్య ఐక్యత, సోదరభావం, పరస్పర సహకారాన్ని పెంపొందించుకుంటూ అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు. ఇతర సామాజిక వర్గాలను గౌరవిస్తూ సమాజంలో ప్రేమపూర్వక వాతావరణాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. మధ్యతరగతి కుటుంబాలకు విద్యే గొప్ప ఆస్తి అని పేర్కొన్న మంత్రి, పిల్లలకు నాణ్యమైన విద్య అందించి ఉన్నత స్థాయికి చేరుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. విద్య ద్వారానే పిల్లలు జీవితంలో మంచి అవకాశాలను అందిపుచ్చుకుని కుటుంబానికి, సమాజానికి గౌరవం తీసుకువస్తారని అన్నారు. ఈ సందర్భంగా బాలబాలికలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి ముందు శెట్టిబలిజల జాతిపిత స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి, విజయవాడ శెట్టిబలిజ సంఘ నాయకులు, సంఘ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img