ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeరాజకీయంప్రచారంలో దూకుడు పెంచిన అజయ్ బాబు....

ప్రచారంలో దూకుడు పెంచిన అజయ్ బాబు….

📰 Generate e-Paper Clip

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK):

22, 23 వార్డుల్లో బ్రహ్మరథం పట్టిన ప్రజలు …

 

 

 

మండపేట మున్సిపల్ ఎన్నికల్లో కూటమి తరఫున టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచిన వేగుళ్ల అజయ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. బుధవారం ఉదయం 22, 23 వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి ఆహ్వానించారు. యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.22వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి కోనే వీర వెంకట సత్యపార్వతికి మద్దతుగా అజయ్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం 23వ వార్డులో జనసేన అభ్యర్థి కోళ్ల లక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ ఓటర్లను కలిశారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ పురపాలక ఎన్నికల్లో ఓటర్లకు బ్యాలెట్ పేపర్‌పై రెండు ఓట్లు ఉంటాయని, ఒక ఓటు చైర్‌పర్సన్ అభ్యర్థిగా తనకు, మరో ఓటు ఆయా వార్డుల్లో కూటమి బలపరిచిన టీడీపీ, జనసేన, బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మద్దతు పలకాలని కోరారు.

యువతకు మెరుగైన అవకాశాలు లభించాలన్నా, ఉజ్వల భవిష్యత్తు ఏర్పడాలన్నా టీడీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. చెప్పిందే చేస్తామన్న నినాదంతో చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలను అమలు చేస్తున్నారని, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని పేర్కొన్నారు.

అనంతరం 23వ వార్డులో పలువురు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చూసి అజయ్ బాబు ఆధ్వర్యంలో భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారు, పార్టీలో చేరిన వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని అజయ్ బాబు భరోసా ఇచ్చారు. వారందరూ కూటమి విజయానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చింతలపూడి సత్తిబాబు, కొండ్రెడ్డి శ్రీనివాస్, యువ నాయకులు మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ తనయుడు చుండ్రు రాజీవ్ కిరీటి, యువ నాయకుడు, సాయి కుమార్ బాబు తనయుడు వల్లూరి గోవిందు, టిడిపి టౌన్ అధ్యక్షులు మచ్చా నాగు,వాద ప్రసాద్ ,మల్లిపూడి గణేష్ ఆయా వార్డుల కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img