ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeరాజకీయంప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రాము....

ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రాము….

📰 Generate e-Paper Clip

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK):

 

30, 31,32 వార్డ్ ల వైస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు…

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మండపేట పట్టణంలోని 30,31,32వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రాము విస్తృతంగా పర్యటించారు.ఆయా వార్డు వైయస్సార్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల మద్దతుగా స్థానిక ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ప్రజలతో మాట్లాడారు.వార్డులోని ఓటర్లను మర్యాదపూర్వకంగా పలకరిస్తూ వైఎస్సార్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆదరించాలని డాక్టర్ రాము కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలపాలని, వార్డు అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజలతో మమేకమవుతూ సాగిన ఈ పర్యటనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img