ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeరాజకీయంప్రజా సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చా....

ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చా….

📰 Generate e-Paper Clip

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK):

మండపేట చిరకాల సమస్యలను పరిష్కరిస్తా….

 

వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పండి…

 

వైసిపి చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రాము….

 

 

మండపేటలో తరతరాలుగా కొనసాగుతున్న వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికి, ప్రజలకు సేవ చేసే వారికి అవకాశం కల్పించాలని వైయస్సార్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రాము పిలుపునిచ్చారు. బుధవారం మండపేటలోని తన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకున్నానని తెలిపారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించి డాక్టర్‌గా ఎదిగానన్నారు. సమాజంలోని అణగారిన వర్గాలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే వైద్య వృత్తిని ఎంచుకున్నానని చెప్పారు. ప్రజల కష్టసుఖాలు తనకు తెలుసని, వారికి మరింత విస్తృతంగా సేవ చేసేందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు.మండపేట మున్సిపల్ చైర్మన్‌గా తనకు అవకాశం కల్పిస్తే పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని డాక్టర్ రాము హామీ ఇచ్చారు. ముఖ్యంగా ప్రతి ఇంటికీ ఉచితంగా స్వచ్ఛమైన మంచినీరు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. మున్సిపాల్టీ లో పేరుకుపోయిన అవినీతి నీ ప్రక్షాళన చేస్తానని పేర్కొన్నారు.పట్టణ అభివృద్ధిలో అంతర్గత రహదారులు కీలకమని, ఇంటర్నల్ రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. దోమల బెడద నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొన్నారు. వాటిని దూరంగా తరలిస్తామని చెప్పారు.గొల్లపుంత టిడ్కో అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.మండపేటలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని డాక్టర్ రాము వ్యాఖ్యానించారు. రాజకీయ వారసత్వం కంటే ప్రజాసేవ, వ్యక్తిత్వం, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. తాను గతంలోనూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించానని గుర్తుచేశారు.ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించడమే తన లక్ష్యమన్నారు. ఉన్నతమైన ఆలోచనలు, సేవాభావం కలిగిన వ్యక్తులను మండపేట ప్రజలు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం తనకుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి ఒక్క అవకాశం కల్పించాలని డాక్టర్ రాము పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img