ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeరాజకీయంచారిత్రాత్మక తీర్పుతో ప్రజలు ఆదరించాలి...

చారిత్రాత్మక తీర్పుతో ప్రజలు ఆదరించాలి…

📰 Generate e-Paper Clip

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK):

 

36 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థుల గెలుపే ఏకైక లక్ష్యం…

 

మండపేట ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వేగుళ్ళ…

 

మండపేట మున్సిపల్ ఎన్నికల్లో 36 కి 36 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజలు చారిత్రాత్మక గెలుపుని అందివ్వాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 35, 36వ వార్డుల్లో ఆయన కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. 35వ వార్డు కూటమి అభ్యర్థి కురుపూడి రామకృష్ణ, 36వ వార్డు జనసేన అభ్యర్థి నామాల చంద్రరావులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలిస్తే వార్డుల్లో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వీధి దీపాలు వంటి ప్రజలకు అవసరమైన సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యమిస్తామని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే పర్యటనతో ఆయా వార్డుల్లో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. స్థానిక నాయకులు, కూటమి శ్రేణులు ప్రచారంలో పాల్గొని అభ్యర్థుల విజయానికి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img