టాలీవుడ్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, వెంకటేష్ లను ఒకే ఫ్రేమ్ లో చూసేందుకు అభిమానులు ఎప్పుడు ముచ్చటపడుతుంటారు. కానీ ఈ నలుగురు కలిసి చాలా అరుదుగా కనిపిస్తారు. కారణం బాలయ్యకు చిరు, నాగార్జున లకు అంతగా సఖ్యత ఉండదు అనే నానుడి వినిపిస్తూనే ఉంటుంది.
నాగార్జున ఉంటే బాలయ్య ఉండరు, బాలకృష్ణ ఉన్న చోట నాగ్ ఉండరు అంటారు. కానీ వెంకటేష్ మాత్రం మిగతా హీరోలతో తత్సంబందాలు మైంటైన్ చేస్తారు. బాలయ్య 50 ఇయర్స్ ఇండస్ట్రీ వేడుకలకు నాగ్ దూరంగా ఉండగా ఇప్పుడు ANR అవార్డు వేడుకల్లో బాలయ్య మిస్ అయ్యారు.
బాలయ్య ఈవెంట్ లో మెగాస్టార్ చిరు, వెంకటేష్ సందడి చెయ్యగా.. అక్కడ నాగార్జున కనిపించలేదు. ఇప్పుడు ANR అవార్డు వేడుకల్లో మెగాస్టార్ చిరు, వెంకీ, నాగ్ లు కనిపించినా బాలయ్య కానరాలేదు. దానితో ప్రతిసారి బాలయ్య ఎందుకు మిస్ అవుతున్నారబ్బా అంటూ మాట్లాడుకుంటున్నారు. బాలయ్య తన వేడుకకు నాగ్ కు ఆహ్వానం ఇవ్వలేదా, ఇచ్చినా నాగ్ రాలేదా.
ఇప్పుడు నాగార్జున బాలయ్య ANR అవార్డు వేడుకకు పిలవలేదా, పిలిచినా బాలయ్య రాలేదా అనేది సస్పెన్స్ గానే కనిపిస్తుంది. ఏది ఏమైనా చిరు-బాలయ్య-వెంకీ-నాగ్ కలిసి కనిపిస్తే ఆ అందమే వేరు.