ePaper
Friday, October 2, 2026
ePaper
Homeఎడిటోరియల్కరపలో ‘వన్ మంత్–వన్ విలేజ్–ఫోర్ విజిట్స్’ కార్యక్రమం

కరపలో ‘వన్ మంత్–వన్ విలేజ్–ఫోర్ విజిట్స్’ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

కరప, ఆగస్టు 14:, Kakinada (VISWAM VOICE DESK):

ప్రజా సమస్యలను అత్యంత పకడ్బందీగా పరిష్కరించడమే లక్ష్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ‘వన్ మంత్–వన్ విలేజ్–ఫోర్ విజిట్స్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ శుక్రవారం కరప మండలంలో పర్యటించారు.

కరప చంద్రన్న సమావేశ మందిరంలో వరుసగా రెండో వారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా అర్జీలు, దరఖాస్తులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించేందుకు నాలుగు వారాల పాటు ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండేలా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కరప మండలం ఎంపీడీవో కార్యాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా వీబీజీ రామ్ జీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించే కార్యక్రమాల్లో ప్రజలు చురుకుగా పాల్గొనాలని ఆయన సూచించారు.

కార్యక్రమంలో డీడీవో పి. వాసుదేవరావు, కరప తహసీల్దార్ లక్ష్మి సరస్వతి, ఎంపీడీవో జె. శ్రీనివాసు, కాకినాడ రూరల్ నియోజకవర్గం, కాకినాడ డివిజన్, కరప మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

కరప మండల ప్రజలు ‘వన్ మంత్–వన్ విలేజ్–ఫోర్ విజిట్స్’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img