విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
మత సామరస్యానికి టిడిపి ఎప్పుడూ కట్టుబడి ఉన్నదని ముస్లింల సంక్షేమానికి అభివృద్ధి కొరకు పాటుపడింది తెలుగుదేశం ప్రభుత్వమేనని
మత సామరస్యానికి ఐక్యత కు ఇఫ్తార్ విందు ప్రతీక గా నిలుస్తాయని నగర మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు తెలిపారు. స్థానిక మెయిన్ రోడ్డు జామియా మసీదు నందు బుధవారం కొండబాబు మైనారిటీ నాయకులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. మసీదు అధ్యక్షులు ఇజాజుద్దీన్ పుష్పగుచ్చం అ౦ది౦చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ హయాంలో ముస్లింల సంక్షేమ అభివృద్ధి కొరకు దుల్హాహన్ పథకం, రంజాన్ తోఫా, విదేశీ విద్య, దుఖాన్ అవర్ మఖాన్, రోషిని పథకం, మైనార్టీ సంక్షేమ నిధి ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని ఇమామ్ మౌజన్ లకు గౌరవ వేతనం అందించిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని నేడు మైనార్టీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ అధ్యక్షులు ఇజాజుద్దీన్, నాసిర్ ఖాన్, ఎస్ కె. బాబులు, ఎం.ఏ తాజుద్దీన్, ఎస్ కె. రహీమ్, అసిఫ్ అలీ, ఎండి. ఆన్సర్, ఎం.డి ఖాన్, ఎం ఎ. సయ్యద్, ఎం.డీ కసుమూర్, షేక్ అన్వర్, గబ్బర్ సింగ్, కరీముల్లా, ఎం.డీ బషీర్, ఖాదర్ ఖాన్, మలిపూడి వీరు, చింతలపూడి రవి, తదితరులు పాల్గొన్నారు.