విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం ( విశ్వం వాయిస్ న్యూస్ )
బెస్ట్ ప్రాక్టీసెస్ అవలంభించి భూ సర్వే ప్రక్రియలో మంచి పురోగతి సాధించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు లను ఆదేశించారు. గురువారం ఆయన అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష రీ సర్వే ఈ ప్రక్రియలో పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దశలో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సర్వేను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ పురోగతిని సాధించాలన్నారు. గ్రౌండ్ ట్రూతింగ్ గ్రౌండ్, గ్రౌండ్ వాల్యూవేషన్ గ్రౌండ్ వర్క్ ,డ్రోన్స్ ప్లేయింగ్, జిపిఎస్ సరిహద్దు రాళ్ళు అమర ఓ ఆర్ ఐ ఇమేజ్ మ్యాపింగ్ తదితర ప్రక్రియలు సజావుగా నిర్వహించి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సుమారుగా 100 సంవత్సరాల తర్వాత సర్వే ఆఫ్ ఇండియా వారి సహకారంతో అత్యాధునిక సాంకేతికతతో ఈ భూ సర్వే చేపట్టడం జరిగిందని అత్యంత స్పష్టతతో నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భావితరాలకు వివాద రహిత భూముల అందించడానికి స్వచ్చికరణ భూ రికార్డులు రూపొందించి ప్రభుత్వ ఆశయ సాధన దిశగా పాటుపడాలన్నారు. నోటీసులు జారీ చేస్తూ ప్రక్రియను అన్ని దశలలో భూ యజమానుల భాగస్వామ్యంతో వేగర పరచాలని సూచించారు. గ్రామాలలో భూ విస్తీర్ణానికి అనుగుణంగా బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్లు సర్వే అధికారులు రోజువారీగా సమీక్షించి పురోగతి సాధిస్తూ ఆ నివేదికలను తమ కూడ సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హీమన్సు శుక్లా మాట్లాడుతూ జిల్లాలో రభీ పంట సీజను పూర్తయిందని భూ సర్వే ప్రక్రియను అన్ని దశలలో వేగవంతం చేయడం జరిగిందని అన్నారు. ప్రతిరోజు జాయింట్ కలెక్టర్, సర్వే అధికారులు, సర్వే బృందాలతో మానిటరింగ్ చేస్తూ ప్రక్రియను వేగిర పరచడం జరిగిందన్నారు. గ్రౌండ్ వర్క్ పూర్తి అయిన పిదప భూ రికార్డుల స్వఛీకరణతో ఆన్లైన్ డేటా అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో తొలిదశలో రాయవరం మండలం లో ఎనిమిది గ్రామాల్లో సర్వే కొనసాగుతోందని, అంబాజీపేట మండలంలో త్వరలో మరో ఎనిమిది గ్రామాలలో ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇమేజ్ మ్యాపులు వచ్చాక ఈ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని ఆయన తెలిపారు. అనంతరం మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గోడౌన్ల నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాల్లో స్థితిగతులు, నిర్మాణాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్లు, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర సర్వే విభాగం సహాయ సంచాలకులు గోపాల కృష్ణ, జిల్లా కో ఆపరేటివ్ అధికారి కుమార్ తదితరులు పాల్గొన్నారు.