రావులపాలెం పంచాయతీ పాలకవర్గం గ్రామప్రజలకు చేస్తున్న హెచ్చరిక
పంచాయతీ విషయం లో ఎవరు ఏ మధ్య వ్యక్తులను ఆశ్రయించి మోసపోవద్దు
మీకు ఏ అవసరం వచ్చిన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పంచాయతీ కార్యదర్శి ఎప్పుడు పంచాయతీ దగ్గర అందుబాటులో ఉంటాము మమల్ని సంప్రదించండి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:
గ్రామంలో నూతనంగా భవన నిర్మాణాలు చేపట్టేవారు , రోడ్లు , డ్రైన్లు ఆక్రమించి వ్యాపారాలు చేసేవారు బ్రోకర్లను ఆశ్రయించి మోసపోవద్దని రావులపాలెం సర్పంచ్ తాడేపల్లి నాగమణి , ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి హెచ్చరించారు . రావులపాలెం గ్రామ పంచాయతీ వద్ద మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ భవన నిర్మాణానికి అనుమతులు పొంది సదరు అనుమతులకు మించి అనధికార కట్టడాలు , నిర్మాణాలు చేసిన వారు , రోడ్లు , డ్రైన్లు ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారికి వాటిని నిలుపుదల చేయడంలో భాగంగా నోటీసులు జారీ చేసి చట్ట పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు . కొందరు వ్యక్తులు అనధికార కట్టడాలు , నిర్మాణాలు చేసిన వారు , రోడ్లు , డ్రైన్లు ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాము చూసుకుంటామని కొన్ని చోట్ల డబ్బులు వసూలు చేసినట్లు గ్రామ పంచాయతీ దృష్టికి వచ్చిందన్నారు . గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు అందిన వెంటనే గ్రామ సర్పంచ్ ను గాని , ఉపసర్పంచ్ ను గాని , పంచాయతీ కార్యదర్శిని గాని సంప్రదించాలని సూచించారు . అనుమతులు లేని అదనపు కట్టడాలకు గ్రామ పంచాయతీ వారి ద్వారా ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నాలు చేసుకోవాలని , అంతే తప్ప మధ్యవర్తులెవ్వరైన వచ్చి డబ్బులు ఇస్తే తాము పై గల చర్యలు నిలుపుదల చేస్తామని అడిగితే గ్రామ పంచాయతీ వారికి గాని , రావులపాలెం పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని సూచించారు . ఇప్పటికే ఈ విషయాన్ని పోలీసుల దృష్టిలో పెట్టామన్నారు . గ్రామంలో గ్రామ పంచాయతీ వారి అనుమతులకు మించి అనధికార కట్టడాలను చేసిన వారిని , స్థలానికి మించి ఆక్రమణ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉ పేక్షించేది లేదని అటువంటి నిర్మాణాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . ఈ సమావేశంలో వార్డు సభ్యులు వెలగల సత్యనారాయణరెడ్డి , కోట శ్రీలక్ష్మి బుజ్జి , సఖినేటి వాకులరాజు , సానబోయిన శ్రీనివాసబాబు తదితరులు పాల్గొన్నారు …..