ఘనంగా నిర్వహించిన గ్రామ ప్రజలు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
తోటపేట లో మావుళ్ళమ్మ సంబరాలు
ఘనంగా నిర్వహించిన గ్రామ ప్రజలు
తాళ్లరేవు మండల పరిధి పోలేకుర్రు పంచాయితీ తోటపేట గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ జాతర మహోత్సవంలో అనేక సాంస్కృతిక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గారడీలు డీజేలు తిలకించడానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 21న తీర్థం జరగనున్నట్లు వారు ప్రకటించారు.