విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:
*వెనుకబడిన తరగతుల 22 సంక్షేమ వసతి గృహాలకు 55 ఇన్వర్టర్లను అందించిన రిలయన్స్ ఇండస్ట్రీస్*
గాడి మొగవారి ఆధ్వర్యంలో సంస్థాపరమైన సామాజిక బాధ్యత నిధులతో అందించారని.
జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా తెలియజేశారు
అమలాపురం, విశ్వం వాయిస్ న్యూస్ మార్చి 20:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 33 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, 22 వెనుకబడిన తరగ తుల సంక్షేమ వసతి గృహాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ గాడిమొగ వారి ఆధ్వర్యంలో సంస్థాపరమైన సామాజిక బాధ్యత నిధులతో 55 ఇన్వర్టర్ లను తొలి దశలో సమ కూర్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా తెలిపారు. ఈ మేరకు సోమవారం 55 ఇన్వర్టర్ యూనిట్లను సాంఘిక సంక్షేమ శాఖ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా అప్పగించారు రాబోయే మూడు రోజుల్లో ఆయా వసతి గృహాలలో ఏర్పాటు చేయాలని సంక్షేమ శాఖ ల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక సంక్షేమo,వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతిగృహాలలో మౌలిక సదుపాయాలు కల్పనకై దశల వారీగా వివిధ కంపెనీల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క నిర్బంధ ఉచిత విద్యకు చట్టం, మరియు మనబడి నాడు నేడు, జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన, అమ్మ ఒడి, విద్యా కానుక తదితర పథకాలు సంస్క రణల ద్వారా పేద విద్యార్థుల విద్యా వ్యాప్తికై పాటుతోందన్నారు మరోప క్క డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోన సీమ జిల్లాలో స్థానికంగా ఉన్న నిక్షేపాలైన చమురు, గ్యాస్ వెలికి తీస్తున్న ఓఎన్జిసి రిలయన్స్, గైయిల్ వేదాంత తదితర,కంపెనీల కార్పొ రేట్ సామాజిక బాధ్యత కింద ఈ ప్రాంత విద్యార్థినీ విద్యార్థుల కనీస అవసరాలను గుర్తించి, సౌలభ్యం కొరకు తాగు నీరు, ఇన్వర్టర్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొం దించుకునేందుకు వీలుగా టీవీలు వంటి మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతోoదన్నారు. రెండో దశలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ ( ఓఎన్జిసి) ద్వారా వసతి గృహాలలో ఒక్కొక్క కంప్యూటర్ మరియు ప్రింటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అదేవిధంగా విద్యార్థినీ విద్యార్థుల సౌకర్యార్థం వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను అన్వయించు కోవడంతోపాటుగా పాఠ్యాంశాలు సులభతరంగా అవగాహన చేసుకునేందుకై టీవీలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వసతి గృహాల్లో ఉండి విద్యను అభ్యసించే విద్యార్థులు వివిధ పరీక్షలు,పోటి పరీక్షలు, పబ్లిక్ పరీక్షలకు సమాయత్తం ,సన్నద్ధతలో ఎటువంటి అసౌకర్యానికి లోనకుండా నిరంతరాయంగా సరఫరా ఉండేందుకు వీలుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు కార్పొరేట్ సామాజిక బాధ్యత క్రింద 55 ఇన్వర్టర్లను సమకూర్చడం జరిగిందని తెలిపారు. విద్యార్థిని విద్యార్థులు కూడా వీటిని సద్వినియోగo చేసుకుని తమ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దు కోవాలని సూచించారు. భవిష్య త్తులో మరిన్ని వసతులు సిఎస్ఆర్ నిధులు ద్వారా కల్పించడం జరుగు తుందని ఆయన సందర్భంగా కోనసీమ జిల్లా విద్యార్థినీ విద్యార్థు లకు భరోసాను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు, రిలయన్స్ ఇండస్ట్రీస్ సి ఎస్ ఆర్ మేనేజర్ పి సుబ్రహ్మణ్యం, కలెక్టరేట్ పరిపాలనాధికారి కాశీ విశ్వేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారిని పి జ్యోతిలక్ష్మి దేవి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి టి వెంకటే శ్వర్లు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె లక్ష్మీనా రాయణ తదితరులు పాల్గొన్నారు