తాళ్లరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
తాళ్లరేవు మండల కేంద్రమైన తాళ్లరేవులో లయన్స్ క్లబ్ సభ్యులు లయన్ వల్లి బాబు జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేదలకు అనారోగ్యంతో డయాలసిస్ఉన్నవారికి గర్భిణీ స్త్రీలకు వృద్ధులకు లయన్ వల్లి బాబు జయంతి సందర్భంగా దుప్పట్లు రొట్టెలు పండ్లు పేషెంట్లకు కొంత ఆర్థిక సహాయం లయన్ అధ్యక్షులు శ్రీ చోడే శ్రీనివాస్ లయన్స్ క్లబ్ సభ్యుల అధ్యక్షతన డా”బాదం బాలకృష్ణ చేతుల మీదుగా అందించారు .ఈ కార్యక్రమంలో ఒంటి తాడి గ్రామపంచాయతీ శీలలంక నుండి డయాలస్సిపేషెంట్ కు కొద్ది ఆర్థిక సహాయం నూతన వస్త్రములు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో సర్పంచ్ నెల్లి బ్రహ్మాజీ , తాళ్ళరేవు లయన్స్ క్లబ్ సభ్యులు బిళ్ళకుర్తి శ్రీనివాసరెడ్డి, ఇతర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.