విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
బాల కార్మికులును నిర్ములిద్దాం భావితరాలకు భవిష్యత్తునిద్దాం
రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న బీమా సౌకర్యాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి
సహాయ ఉపాధి కల్పనాధికారి గోదావరి కేశవరావు
రాయవరం,విశ్వం వాయిస్ న్యూస్:బాల కార్మికులతో పనులు చేయించే సంస్థలపై దాడులు నిర్వహించి,జరిమానా విధిస్తామని రాయవరం సహాయ ఉపాధి కల్పనాధికారి గోదావరి కేశవరావు హెచ్చరించారు.గురువారం ఆయన మాట్లాడుతూ దేశం అభిహృది చెందాలంటే బాల,బాలికలగా వున్నపుడే భవిష్యత్తుకు విద్య అనే పునాది బలంగా ఉంటేనే సాధ్యం అవుతుందని అన్నారు.పిల్లలు యొక్క తల్లితండ్రులు ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్న పిల్లలును బడికి పంపే విషయంలో నిర్లక్ష్యం వహించకూదు అని తెలియజేసారు.ప్రభుత్వం చదువుకోవడానికి అనేక అవకాశాలు కల్పించి, గవర్నమెంట్ హాస్టల్ వున్న ఎందుకు వెనకబడిపోతున్నారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా తల్లితండ్రులు ఆలోచన చేసి ఆస్తులు,అంతస్థులు ఇవ్వకపోయినా చదువు అనే ఆయుధం ఇస్తే ప్రపంచంలో ఏ దేశంలో అయినా రానించగలరని ఈసందర్బంగా తెలియజేసారు.
అలానే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న బీమా సౌకర్యాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని,రూ.110 నామమాత్రపు రుసుముతో కార్మికులకు అయిదేళ్ల కాలపరిమితికి బీమా సౌకార్యాన్ని అందజేస్తున్నామన్నారు. ఆధార్,వ్యక్తిగత బ్యాంకు ఖాతా,రెండు పాస్ పోర్ట్ ఫోటోలు,ఫోన్ నెంబరుతో కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. దుకాణ,సంస్థల యజమానులు లేబర్ సెస్సు పునరుద్ధరణ చేయించుకోవాలని,కార్మికుల సంక్షేమ నిధికి నిర్దేశిత నగదు చెల్లించాలన్నారు.భవన, వ్యాపార,వాణిజ్య సముదాయాల నిర్మాణదారులు ఒక శాతం లేబర్ సెస్స్ చెల్లించాలని,రిజిస్ట్రేషన్ కాపీ,రశీదు జిరాక్స్లను కార్యాలయానికి అందజేయాలని యజమానులకు సూచించారు.