✍️ విలేకరి: K Sunil John (కాకినాడ అర్బన్)
క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం, కాకినాడ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక సమావేశం మధ్యాహ్నం 1:20 గంటలు దాటినా ఇంకా ప్రారంభం కాలేదు. జడ్పీటీసీ సభ్యులు ఇప్పటివరకు హాజరుకాకపోవడంతో జిల్లా పరిషత్ సమావేశ మందిరం పూర్తిగా బోసిపోయింది. మరోవైపు, జడ్పీటీసీలంతా కాకినాడలోని ఒక ప్రైవేటు హోటల్‌లో సమావేశమై మంతనాలు జరుపుతున్నట్లు స్థానిక రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రజాసేవ చేయాల్సిన ప్రజాప్రతినిధుల మధ్య అవగాహన లోపం, గ్రూపు రాజకీయాల కారణంగానే ఈ జాప్యం నెలకొందని స్థానిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఎవరిని వరిస్తాయనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

