ePaper
Saturday, November 21, 2026
ePaper
Homeఎడిటోరియల్జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ పదవిపై పిల్లి అనంతలక్ష్మి అసంతృప్తి.. అలకబూనిన మాజీ ఎమ్మెల్యే!

జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ పదవిపై పిల్లి అనంతలక్ష్మి అసంతృప్తి.. అలకబూనిన మాజీ ఎమ్మెల్యే!

📰 Generate e-Paper Clip

✍️ విలేకరి: K Sunil John (కాకినాడ అర్బన్)

కాకినాడ: కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీలో పదవుల కేటాయింపు వ్యవహారం అసంతృప్తికి దారితీసింది. కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జెడ్పీటీసీ సభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ పదవిని చేపట్టేందుకు విముఖత వ్యక్తం చేస్తూ అలకబూనారు.
​జెడ్పీ చైర్‌పర్సన్ పదవి ఇస్తామని పార్టీ హామీ ఇవ్వడంతోనే ఆమె కాకినాడ రూరల్ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే, పొత్తులో భాగంగా జెడ్పీ చైర్మన్ పదవి జనసేనకు వెళ్లడంతో, టీడీపీ ఆమెకు జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ పదవిని కేటాయించేందుకు అవకాశం ఇచ్చింది.
​ఈ పరిణామంపై పిల్లి అనంతలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనకు వైస్ చైర్‌పర్సన్ పదవి అవసరం లేదని ఆమె తన అనుచరుల వద్ద స్పష్టం చేస్తున్నారు. చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వమని ముందే చెప్పి ఉంటే, అసలు తాను జెడ్పీటీసీకి పోటీ చేసేదాన్ని కాదని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img