ePaper
Monday, November 23, 2026
ePaper
Homeరాజకీయంరామచంద్రపురం మున్సిపల్ చైర్మన్‌గా మేడిచెట్టు శేషారావు, వైస్ చైర్మన్‌గా కవల నారాయణమూర్తి నేడు ప్రమాణ స్వీకారం

రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్‌గా మేడిచెట్టు శేషారావు, వైస్ చైర్మన్‌గా కవల నారాయణమూర్తి నేడు ప్రమాణ స్వీకారం

📰 Generate e-Paper Clip

RAMACHANDRAPURAM (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):


రామచంద్రపురం మున్సిపాలిటీలో నేడు నూతన పాలకవర్గం కొలువుదీరనుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూటమి తరఫున విజయం సాధించిన (టీడీపీ )అభ్యర్థి మేడిచెట్టు శేషారావు( జే ఎస్ పి ) మున్సిపల్ చైర్మన్‌గా, జనసేన అభ్యర్థి కవల నారాయణమూర్తి వైస్ చైర్మన్‌గా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టనుండటంతో పట్టణంలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి ఆర్డీవో సరళవతి, మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్. రాజు ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రమాణ స్వీకారానికి అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసి కార్యక్రమం సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు. నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు అధికారికంగా బాధ్యతలు అప్పగించే ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. టీడీపీ, జనసేనకు చెందిన కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. ఎన్నికల్లో ప్రజల మద్దతుతో విజయం సాధించిన నూతన చైర్మన్, వైస్ చైర్మన్ పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు. రహదారులు, పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు పట్టణ సమస్యల పరిష్కారంపై నూతన పాలకవర్గం దృష్టి సారించాల్సి ఉంది. నేటి ప్రమాణ స్వీకారంతో రామచంద్రపురం మున్సిపాలిటీలో నూతన పాలనకు శ్రీకారం చుట్టనుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img