ePaper
Thursday, November 26, 2026
ePaper
Homeరాజకీయంమండపేట మండలంలో పంచాయతీ ఎన్నికల కోలాహలం...

మండపేట మండలంలో పంచాయతీ ఎన్నికల కోలాహలం…

📰 Generate e-Paper Clip

Mandapeta (Mandapeta), East Godavari (VISWAM VOICE DESK):

సర్పంచ్ పదవులకు 38 మంది అభ్యర్థులు తలపడుతున్న వైనం…

13 వార్డులు ఏకగ్రీవం.. 143 వార్డులకు 296 మంది పోటీ…

మండపేట మండలంలో గ్రామపంచాయతీ రెండో సాధారణ ఎన్నికలు–2026కు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ అనంతరం తుది పోటీదారుల వివరాలను అధికారులు ప్రకటించారు.మండల పరిధిలోని 12 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ స్థానాల కోసం మొత్తం 38 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కే. సత్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాస్ వెల్లడించారు.ఇక వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి మండలంలోని 156 వార్డుల్లో 13 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మారేడుబాకలో 5, పాలతోడులో 5, తాపేశ్వరంలో 3 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన 143 వార్డులకు 296 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు అధికారులు వివరించారు.ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఎంపీడీవో తెలిపారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img