విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
బుధవారం ఉదయం 9 గంటలకు మండల వైసీపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ చేయనున్నట్లు వైసిపి మండల అధ్యక్షుడు తమలంపూడి గంగాధర రెడ్డి మంగళవారం సాయంత్రం స్థానిక విలేకరులకు తెలిపారు. గంగాధర రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో బస్టాండ్ ఎదురుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేతుల మీదుగా ప్రారంభం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, ఆయా గ్రామాలలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.