విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ విశ్వం వాయిస్ న్యూస్
కాకినాడ, జూన్ 22: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు జహీరుద్దీన్ జీలాని బుధవారం మీడియాతో మాట్లాడారు. మాట తప్పను మడం తిప్పను అని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో విశాఖపట్నం లో మైనార్టీ సోదరులకు ఇస్లామిక్ బ్యాంక్ పెట్టి నిరుపేద ముస్లింలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి మాట తప్పారని జిలానీ విమర్శించారు,
టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత దేశంలోనే ఎక్కడా లేని విధంగా 1985లో ముస్లింల అభివృద్ధికి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి నుంచి అ కార్పొరేషన్ ద్వారా అనేక మంది ముస్లిం లకు ఎన్నో విధాలుగా లబ్ది చేకూరుతుందని వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేసారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు,
టిడిపి నిరు పేద ముస్లింలకు షాదీ ముబారక్, రంజాన్ తొఫా, వంటి పదకాలతో ముస్లింలకు ఎంతో కొంత వెన్నుదన్నుగా ఉండేదని తెలిపారు, మళ్లీ తమ ముస్లింలు అభివృద్ధి చెందాలన్న న్యాయం జరగాలన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఇది ప్రతి ఒక్క ముస్లిం సోదరులు తెలుసుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని జిలానీ కోరారు.