విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
నేటి ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల పలువురు వ్యాధులకు గురవుతున్నారని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్,బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నేటి యువత తీసుకునే ఆహారం ,వేళాపాళా లేకుండా భుజించడం వల్ల 30 ఏళ్లకే పలువురు మధుమేహం, బిపి , కీళ్ల నొప్పులు వంటి వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. రోగాలు వచ్చిన తర్వాత మందులు మింగే కన్నా అవి రాకుండా నివారించడం ముఖ్యమన్నారు. ఇందుకు ఎక్కువగా చిరుధాన్యాలు తీసుకోవాలన్నారు. పోషక విలువలు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.