విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:
ప్రతిష్టాత్మకమైన స్పందన కు పోటెత్తుతున్న ప్రజలు
– గ్రామ,మండల స్థాయి సిబ్బంది అలసత్వం కారణం
– ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్న కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
– పరిష్కారం కాకున్నా ఆన్లైన్ లో అయినట్లు తప్పుడు నమోదు
– గ్రామ, మండల స్థాయి సిబ్బందికి మరింత క్రియాశీలత అవసరం
(అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్:)
–
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు ప్రతి సోమవారం తు చ తప్పక నిర్వహించే స్పందన అర్జీ కార్యక్రమానికి తమ సాధక బాధలను విన్నవించుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతునే వున్నారు. ప్రజలు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులు, అర్జీలను సంబంధిత గ్రామ సచివాలయాలకు అందజేసి, సాధ్యమైనంత త్వరగా ఆ అర్జీలను పరిష్కరించేందుకు జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నారు.
గ్రామ స్థాయిలో నియమితులైన రెవెన్యూ అధికారులు లేదా మండల స్థాయి అధికారుల వలన పరిష్కరింపబడని సమస్యలు ఎస్కలేషన్ విధానం ద్వారా జిల్లా కలెక్టరేట్ కు వెళ్లే విధంగా ప్రత్యేక మానిటరింగ్ విధానం కూడా స్పందన కార్యక్రమానికి అనుసంధానించబడి వుంది. అయితే ప్రజల సమస్యలను పరిష్కరించడంలో గ్రామ స్థాయి మరియు మండల స్థాయి అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని,నెలల తరబడి కూడా తమ ఫిర్యాదులను, అర్జీలు పెండింగులో వుండిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.x
గ్రామ స్థాయిలో లేక మండల స్థాయిలో పరిష్కరింపబడాల్సిన చిన్నపాటి సమస్యల పట్ల క్రియాశీలక చర్యలు తీసుకోకుండా కింద సిబ్బంది నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుండటం వలన విధిలేక ప్రజలు కలెక్టరెట్ కు వస్తుండడంతో ప్రతి సోమవారం ప్రజలతో కిక్కిరిసిపోతోంది.ఇక్కడికి వస్తున్న ప్రజల ప్రధాన సమస్యలలో వృద్ధాప్య పింఛన్లు అందడం లేదని, రేషన్ కార్డులలో పేర్లు అక్రమంగా తొలగింపు,పేదలకు ఇళ్ల స్థలాలు పధకంలో ఇళ్ళ పట్టాలు ఇవ్వకపోవడం, అమ్మఒడి పధకం అందడం లేదని,వరద ముంపు సహాయం అందలేదని, ఇలాంటి సమస్యలు నిజానికి గ్రామ స్థాయిలోనే, మహా అయితే మండల స్థాయిలో పరిష్కారం అవుతాయి.
అయితే గ్రామ స్థాయి అధికారుల అలసత్వం వలన , సమస్యలు నెలల తరబడి పెండింగులో పడిపోతున్నాయి. విధిలేక ప్రజలు ఉన్నతాధికారులను ఆశ్రయించాల్సి వస్తొంది. ఇటీవల వస్తున్న ఫిర్యాదుల సంఖ్యను బట్టి వాటిని తక్షణమే పరిష్కరించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చెయ్యడం ముదావహం. అయితే తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి కొందరు అధికారులు స్పందన అర్జీలను ఆన్లైన్ లో నమోదు చేశాక, వాటిని పరిష్కరించకుండానే ఆన్లైన్ లో పరిష్కారమై పోయినట్లు చూపిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇందుకు ప్రత్యక్ష సాక్షులు మలికిపురం మండలం రామరాజు లంక గ్రామ సర్పంచ్ కాకర శ్రీనివాస్, 2013 నుంచి 2018 వరకు పంచాయతీలో ఉండవలసిన ఎం బుక్కులు లేవని కార్యదర్శి చెప్పడంతో కలెక్టరేట్ ను ఆశ్రయించారు వారి సమస్య పరిష్కారం కాకుండానే పరిష్కారం అయినట్టుగా సంతకాలు చేయమనడంతో నిరాకరించిన సర్పంచ్ శ్రీనివాస్ పై మండల ఎంపీడీవో బాబ్జి రాజు, జేఈ, డి ఈ ఈ అధికారులు అర్జీ పరిష్కరించినట్టుగా సంతకం చేయమని ఒత్తిడి పెంచారు.
అలాగే ఉప్పలగుప్తం మండలం బడుగు వారి పేట మాకే వెంకటేశ్వరరావు వ్యవసాయ భూములను ఆక్వా చెరువులుగా మారుస్తున్నారని అందువల్ల పక్కనున్న వ్యవసాయ భూమి కాస్త పాడైపోయి పంటలు పండటం లేదని ఆక్వా చెరువులు నిలుపుదల చేయాలని కలెక్టర్స్ స్పందనలో అర్జీ ఫిర్యాదు చేసారు. ఇక దేవగుప్తం మండలం గొల్లపాలెం రామాలయం పేట గ్రామస్తులు గ్రామంలో త్రాగునీరు రావడంలేదని 60 మంది మహిళలు ఐదురు మగవారు కలెక్టరేట్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు మలికిపురం మండలం తూర్పు పాలెం పంచాయితీ తూర్పు పేట గంటా సుభద్రమ్మ పెన్షన్ రావట్లేదని ఫిర్యాదు, చేసింది
కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామపంచాయతీ వేటుకూరి శ్రీనివాసరాజు తండ్రి శ్రీరామరాజు రబీలో అమ్మిన ధాన్యానికి డబ్బులు పడలేదని ఫిర్యాదు చేశారు, పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామపంచాయతీ ఉండ్రాజవరపు బేబీ భర్త దుర్గారావు బాకీ డబ్బులు జమ చేసిన అదనపు వడ్డీ కోసం వేధింపులు చేస్తున్నారని. ఫిర్యాదును ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రజల సమస్యలు అన్నియు కూడా గ్రామస్థాయి మండల స్థాయిలోనే కనిపిస్తున్నాయి కానీ గ్రామ మండల స్థాయి అధికార యంత్రాంగం ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు.
ఎంతో అమూల్యమైన సమయాన్ని వెచ్చించి కలెక్టరేట్లో ప్రతి సోమవారం స్పందన అర్జీ ఫిర్యాదుదారులతో మమేకమై వారి యొక్క సమస్యలను వింటున్న కలెక్టర్, హిమాన్సు శుక్ల ,జెసి ధ్యానచంద్ర, డిఆర్ఓ సత్తిబాబు మరియు ఉన్నత అధికారులు అమూల్యమైన సమయాన్ని కేటాయించడం ఎంతో గొప్ప విషయం.అయితే గ్రామ, మండల స్థాయిలో సిబ్బంది పనితీరు బాగుపడితే ఉన్నతాధికారుల వరకు ఇటువంటి చిన్న చిన్న విషయాలు ప్రజలు ఉన్నతాధికారుల వద్దకు రావాల్సిన అవసరం ఉండదని. ఇకనైనా ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.