విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం మండలం:
– 24 గంటల్లో చెత్తా చెదారాల తొలగింపు..
అధ్వానంగా చెత్త నిర్వహణ కథనంపై అధికారులు స్పందన…
– ఎల్లప్పుడూ పారిశ్యుద్ధం ఈ తరహాలోనే ఉండాలని గ్రామస్థుల డిమాండ్
– సామాజిక బాధ్యతతో ప్రజా సమస్యలతో మమేకం అవుతున్న విశ్వం వాయిస్
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:
అధ్వాన్నంగా చెత్త నిర్వహణ శీర్షికతో విశ్వం వాయిస్ దినపత్రికలో సెప్టెంబరు 14 న ప్రచురితమైన వార్తకు తక్షణ స్పందన లభించింది. సోమేశ్వరం గ్రామ సర్పంచ్ షేక్ షరీఫ్ వెంటనే స్పందించి పారిశుధ్య కార్మికుల చేత సోమేశ్వరం వంతెన వద్ద ప్రధాన రహదారి(మండపేట కాలువ వైపు) గుట్టలు గుట్టలుగా పేరుకొనిపోయి వున్న చెత్తా చెదారాలను, కుళ్ళి దుర్వాసన కొడుతున్న వ్యర్ధాలను తొలగించి , బ్లీచింగ్ పౌడరు కూడా జల్లించారు.అట్లే సోమేశ్వరం వంతెన కింద కారం మిల్లు వీధి ఎదురుగా మరియు సంత మార్కెట్ వద్ద కూడా చెత్తా చెదారాలను శుభ్రం చేయించి పారిశ్యుద్ధం అబివృద్ధి చేయడం జరిగింది. ప్రజా సమస్యల పట్ల తక్షణం నిజాయితీగా స్పందిస్తూ ప్రజాసేవ చేస్తున్న విశ్వం వాయిస్ దినపత్రికకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసారు.