తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా రహదారిపై నిరసన తెలియజేసిన నాయకులు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బందుకు పిలుపునిచ్చింది. తాళ్లరేవు మండల నాయకులు కార్యకర్తలు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తాళ్లరేవులో రహదారిపై వర్షంలో తడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై టైర్లకు నిప్పు పెట్టి సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. కొందరు నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మీద కక్షపూరితంగానే ఇటువంటి కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతుందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న నాయకున్ని ఎవరు ఏమి చేయలేరని అన్నారు. త్వరలో వచ్చేది తమ ప్రభుత్వమే అని ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకే పట్టం కడతారని అన్నారు. కోరింగ వంతెన వద్ద నుండి నిరసన కార్యక్రమం మొదలై తాళ్లరేవు వరకు నిరసన తెలియజేశారు. తాళ్లరేవులోని దుకాణాలు కూడా స్వచ్ఛందంగా బందుకు మద్దతుగా మూసివేశారు. కార్యక్రమంలో తాళ్లరేవు మండల నాయకులు కట్టా త్రిమూర్తులు, జక్కల ప్రసాద్ బాబు, సాధనాల వెంకట శివరామకృష్ణ,ఊడావెంకట రామకృష్ణ,టేకుమూడి లక్ష్మణరావు,దున్నమహేంద్ర బాబు,వాడ్రేవు వీరబాబు, నిమ్మకాయల మూర్తి, ధూళిపూడి వెంకటరమణ( బాబి), ఎరుపల్లి వీరన్న మండల నలుమూలల నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.