*రోడ్డు ప్రమాదంలో వృద్ధునికి తీవ్ర గాయాలు*
హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్
ముమ్మిడివరం మండలం కోమానపల్లి సెంటర్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో వృద్ధునికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకెళ్తే అమలాపురం నుండి కాకినాడ వెళ్తున్న AP5Z 0144 నెంబర్ గల కాకినాడ డిపో బస్సు ను ముమ్మిడివరం మండలం కొమనపల్లి వద్ద గుర్తుతెలియని వ్యక్తి ఎదురుగా వస్తున్న బస్సును బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయాలు పాలైన వ్యక్తిని హుటాహుటిన అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు ఈ ప్రమాద సంఘటనపై అక్కడున్న వారిని విశ్వంవాయిస్ విలేఖరి విచారించగా ఆర్టీసీ డ్రైవర్ తప్పిదం లేదని, వయసులో పెద్దాయన బస్సుకు ఎదురుగా వచ్చి బైక్ మీద బలంగా ఢీకొట్టాడని,ఆ సంఘటన స్థలం లో చూసినవారు చెబుతున్నారు.
తీవ్ర గాయాలు పాలైన వ్యక్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉన్నది. రోడ్డు ప్రమాద వివరాలు కాకినాడ డిపో మేనేజర్ మనోహర్ విశ్వం వాయిస్ అమలాపురం రూరల్ పత్రిక విలేఖరి ఎడ్ల సురేష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు.

