– జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం, విశ్వం వాయిస్
కోనసీమలో కొంతమంది రైతులు క్రాఫ్ట్ హాలిడే పై దరఖాస్తు చేశారని దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని,
ప్రభుత్వ పరంగా ఆదుకోవడం జరుగుతుందని డ్రైన్ మరమ్మతు పనులు త్వరలో చేపట్టడం జరుగుతుందని కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. బుధవారం కలెక్టర్ , స్థానిక రెవిన్యూ డివిజనల్ అధికారి వసంతరాయుడు, ఇరిగేషన్ ఇంజనీర్లు, అల్లవరం, కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాల్లోని గ్రామాల్లో డ్రైవ్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు తమ దృష్టికి తీసుకుని వచ్చిన అంశాలను పరిశీలిస్తున్నామని, కాలువ పూడికతీత పనులు వారం రోజుల్లో చేపట్టనున్నట్లు తెలిపారు.
అదే విధముగా గత సంవత్సరం రావలసిన బకాయిలు చెల్లించడం జరుగుతుందన్నారు.
క్రాఫ్ హాలిడే పై తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఇలాంటి వారి మాటలు నమ్మవద్దని రైతాంగానికి ప్రభుత్వ పరంగా పూర్తిగా అండగా ఉంటామని ఈ సందర్భంగా రైతులకు ప్రజాప్రతినిధులకు కలెక్టర్ హిమాన్షు శుక్లా వివరించారు.