– క్రియ శీలకంగా రెడ్ క్రాస్ సేవలు ఉండాలనీ ఆర్డివో
సూచనలు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
అమలాపురం, విశ్వం వాయిస్
మానవసేవే మాధవ సేవగా భావించి మానవత్వం, నిష్పాక్షికత ,తటస్థత స్వాతంత్రం, స్వచ్ఛంద సేవ, ఐక్యత సార్వత్రికత వంటి అంశాలు ప్రాధాన్యతగా తీసుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అంకిత భావంతో సేవలందించాలని నూతనంగా ఎంపిక కాబడిన నూతన కార్యవర్గ సభ్యులకు జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్. సత్తిబాబు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు కోనసీమ జిల్లా బ్రాంచ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని డి ఆర్ వో సమక్షంలో ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాన్ హెన్రీ డునాట్ జన్మదినాన్ని పురస్కరించుకొని మే 8వ తేదీన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు ప్రత్యేకత, ఐక్యత వాతావరణ సంక్షోభం, మానవ అత్యవసర పరిస్థితులు విపత్తులో చిక్కుకున్న శరణార్థులకు దయతో కూడిన సేవలను రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అందించాలని నూతన కార్యవర్గానికి సూచించారు. ఆహార కొరత, ప్రకృతి వైపరీత్యాలు అంటువ్యాధులతో బాధపడుతూ ఉన్న ప్రజలు పేద ప్రజలకు సహాయం చేయుటలో క్రియా శీలకంగా రెడ్ క్రాస్ సేవలు ఉండాలని ఆయన సూచించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన దృష్టి రక్తాన్ని సేకరించి ప్రాణదానం చేయడం, శరణార్థులకు మానవతా దృక్పథంతోసేవలు అందించడం లో నూతన కార్యవర్గం పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆయన సూచించారు. 2004వ సంవత్సరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డిసెంబర్ లో సంభవించిన సునామీ తుఫాన్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందించిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రజలకు రెడ్ క్రాస్ సొసైటీ ఆర్థిక సహాయం కూడా అందించిందన్నారు. విశ్వజన నీయ మానవతా స్వచ్ఛంద సేవలు అనే విలువలకు కట్టుబడి సమాజ హితం కోసం రెడ్క్రాస్ నిబంధనలకు లోబడి నూతన కార్యవర్గం పని చేయాల్సి ఉంటుందన్నారు. రెడ్క్రాస్ సేవల ద్వారా స్వీయ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ప్రస్తుత తరం తరువాతి తరం మనుగడ అవసరమైన సాంకేతికతను గురించి తెలియజేయడం ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం, శక్తి పెంపొందుతాయన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి సమక్షంలో కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ మెంబర్లు ఏకగ్రీవంగా సెక్రెటరీగా టీఎస్ శర్మను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అదేవిధంగా కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ ఫంక్షన్ నరి అధ్యక్షులుగా కె సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా పి వి ఎస్ రాజు, ట్రెజరర్ గా ఎo. వి వి ఎస్ సుబ్బరాజు ను ఎంపిక చేశారు. ఈ ఎంపిక కార్యక్రమంలో ఎంపిక పరిశీలకులుగా ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శివ నాగేంద్ర రెడ్డి,వై ఎం రెడ్డి లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు.