విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ విశ్వం వాయిస్ న్యూస్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా అలై డా. చప్పిడి ఆదేశాలమేరకు నడకుదురు గ్రామంలో అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో అధ్యక్షులు అలై ముద్దన వెంకటేష్, క్లబ్ సభ్యులు, యోగా గురువు పెంకే లోవరాజు గారు యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా క్లబ్ సమావేశం నిమిత్తం నేపాల్ దేశంలో ఉన్న అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ అంతర్జాతీయ కమిటీ చైర్ పర్సన్, హెల్త్ అవేర్ అధ్యక్షులు అలై డా. చప్పిడి వెంకటేశ్వరరావు చరవాణిలో మాట్లాడుతూ ప్రతిరోజూ యోగా చేయడం వలన ఆరోగ్యంతో పాటు మనసును కూడా మన అధీనంలో ఉంచుకోవచ్చని తెలిపారు అలాగే ప్రపంచదేశాలన్నీ యోగా శిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నాయని ఇది మన దేశానికి గర్వకారణం అని అన్నారు.ముఖ్య అతిధులుగా విడిజి2అలై. వనుం శ్రీనివాసరావు పాల్గొని ప్రతి ఒక్కరూ సూర్యనమస్కారాలు చేయాలనీ దానివలన వ్యాయామమే కాకుండా సూర్యరశ్మి వలన మన శరీరానికి డి విటమిన్ అందుతుందన్నారు. కార్యక్రమం అనంతరం తూరంగి గ్రామంలో గల గోపాలకృష్ణ భార్గవలక్ష్మి పౌండేషన్ జనావలి వృద్ధుల ఆశ్రమం నందు వృద్దులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో కార్యదర్శి అలై వనుం. ఉపేంద్రనాథ్, కోశాధికారి అలై కొత్త శ్రీరాములు, స్వాతి క్లబ్ సభ్యులు అలై కట్టా జగన్, అలై పెంకే గోవిందరాజు, అలై ఎన్. శ్రీనివాస్,అలై కె. ఫణిశర్మ మరియు యోగా సభ్యులు పాల్గొనడం జరిగింది.