విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం రూరల్:
స్పందన స్ఫూర్తి సౌజన్యంతో
కుట్టు మిషను శిక్షణ అనంతరం మహిళలకు సర్టిఫికెట్ అందజేత
మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో
అమలాపురం రూరల్ విశ్వం వాయిస్ న్యూస్
డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం కామనగరువు గ్రామంలో స్పందన స్ఫూర్తి సౌజన్యంతో మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో 25 మంది మహిళలకు 3 నెలలు కుట్టు మిషను ఉచిత శిక్షణను అందించారు. శిక్షణ తీసుకున్న మహిళలకు ప్రముఖ సింగర్ కుట్టు మిషన్ల సంస్థ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మహిళలకు సంస్థ కుట్టు మిషనుకు సంబంధించిన కిట్లు, ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రాలను గ్రామపంచాయతీ సర్పంచ్ నక్కా అరుణ కుమారి చంద్రశేఖర్, స్పందన అమలాపురం బ్రాంచ్ మేనేజర్ రవికుమార్, మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ ప్రోజెక్ట్ మేనేజర్ కిరణ్ ప్రసాద్ ల చేతుల మీద అందజేశారు. ఈ కార్యక్రమంలో కుట్టు మిషను శిక్షణ సెంటర్ కోఆర్డినేటర్ ఎం.జ్యోతి, ట్రైనర్ జి. గంగాభవాని… మరియు కుట్టుమీషను శిక్షణ పొందిన మహిళలు పాల్గొన్నారు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.. అనంతరం శిక్షణ పొందిన సభ్యులు లకు టైలరింగ్ కిట్లు &సింగర్ కుట్టు మీషన్ కంపెనీ నిర్వహించిన పరిక్షలొ ఉత్తిర్ణత సాధించిన సభ్యులకు సర్టిఫికెట్ పంపిణీ చేశారు .